Israel-Iran War: ఇరాన్ క్షిపణులను కూల్చింది ఇజ్రాయెల్ కాదు.. మేమే!: అమెరికా

US shot down most Iranian missiles and drones not Israel
  • శనివారం ఇజ్రాయెల్‌పై 300 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
  • వాటిలో 99 శాతం క్షిపణులను మిత్ర దేశాల సాయంతో కూల్చేశామన్న ఇజ్రాయెల్
  • ఇరాన్ ప్రయోగించిన 25 క్రూయిజ్ మిసైళ్లను సరిహద్దుకు ఆవలే ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్ రక్షణ దళాలు
ఈ నెల 13న ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వాటిని కూల్చేసింది తామే కానీ, ఇజ్రయెల్ కాదని అమెరికా ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌కు చేరుకునేలోపే అమెరికా విమానాలు, క్షిపణులు వాటిని కూల్చివేసినట్టు అమెరికా సైనికాధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడికి దిగిన ఇరాన్ శనివారం 300కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో దాదాపు 99 శాతం క్షిపణులు, డ్రోన్లను మిత్రదేశాలు అమెరికా, జోర్డాన్, ఫ్రాన్స్, బ్రిటన్ సాయంతో కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. 

ఇరాన్ ప్రయోగించిన వాటిలో దాదాపు సగం ఆయుధాలు సాంకేతిక సమస్యతో విఫలమయ్యాయని, మిగతా 80 శాతం క్షిపణులను తాము ధ్వంసం చేసినట్టు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇరాన్ క్షిపణులను తమ విమానం ఎక్కడ అడ్డగించి ధ్వంసం చేసిందన్న వివరాలను అమెరికా బయటపెట్టలేదు. కాగా, సౌదీ అరేబియాలోని అమెరికా బేస్ ప్రస్తుతం క్రియాశీలంగా ఉంది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 25 క్రూయిజ్ మిసైళ్లను తమ యుద్ధ విమానాలు దేశ సరిహద్దుకు ఆవల కూల్చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి.
Israel-Iran War
America
USA
Missiles
Drones
War

More Telugu News