YS Sharmila: పెద్దిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారు: వైఎస్ షర్మిల

Minister Peddireddi is corruption king says YS Sharmila
  • పీలేరు నియోజకవర్గంలో షర్మిల ప్రచారం
  • పీలేరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేతిలో రబ్బరు బొమ్మ అని వ్యాఖ్య
  • జగన్, చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శ
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఒక రబ్బరు బొమ్మ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కనుసన్నల్లో పీలేరు ఎమ్మెల్యే పని చేస్తాడని చెప్పారు. పెద్దిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనైనా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. నవ్యాంధ్రను పదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు, జగన్ లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ పోరాడలేదని విమర్శించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవనిలాంటిదని చెప్పారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని తెలిపారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు... ఆ తర్వాత హోదాను పక్కన పెట్టేశారని విమర్శించారు. మెడలు వంచి హోదా తెస్తామన్న జగన్... రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పీలేరు బహిరంగసభలో మాట్లాడుతూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila
Congress
Jagan
Peddireddi Ramachandra Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News