ECI: ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ

EC clarifies election code will be applied to govt advisers also
  • ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు
  • రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ
  • కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ
ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వివరించింది. ఈ మేరకు ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 

నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ECI
Advisers
Election Code
Andhra Pradesh

More Telugu News