Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం రాబోతోంది: చంద్రబాబు

 TDP Chief Chandrababu Ram Navami Wishest To Andrapradesh People
  • రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ చీఫ్
  • ప్రజల సుఖసంతోషాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగాలని వ్యాఖ్య 
  • అప్పుడే సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందన్న చంద్రబాబు
శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం రాబోతోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలించాడు కాబట్టే శ్రీరాముడి పాలన గురించి, త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామని గుర్తుచేశారు. పాలకులు తమ కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని, వారి సుఖసంతోషాలకు ప్రాధాన్యమివ్వాలని రామ కథ చెబుతోందన్నారు. అటువంటి పాలకులు, అటువంటి పాలనలో ఊరు పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని చంద్రబాబు వివరించారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Chandrababu
Ram Navami
Andra pradesh
TDP Chief

More Telugu News