Sri Rama Navami: జంటనగరాల్లో నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

Sri Rama Navami Shobha Yatra Today In Twin Cities Today
  • భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర
  • ధూల్‌పేట సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర
  • రాత్రి 11.30 గంటల వరకు గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
  • 1000 మంది పోలీసులతో భద్రత
శ్రీరామ నవమి సందర్భంగా నేడు జంట నగరాల్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధూల్‌పేట సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యిమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర నిర్వహించాలని హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భవ్య శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.
Sri Rama Navami
Shobha Yatra
Hyderabad
Secunderabad
Lord Sri Rama

More Telugu News