KTR: అనన్యరెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు
- తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించిన అనన్యకు కేటీఆర్ ప్రత్యేక అభినందనలు
- వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
- దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానన్న కేటీఆర్
సివిల్స్‌లో సత్తాచాటిన అనన్యరెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించిన ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దాదాపు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్‌కు చెందిన దోనూరి అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.