Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు

Pawan Kalyan will file nomination on April 23 in Pithapuram
  • ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ
  • ఈ నెల 23న నామినేషన్ వేయనున్న జనసేనాని
  • పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారన్న జనసేన పార్టీ 
  • అదే రోజు సాయంత్రం ఉప్పాడలో భారీ బహిరంగ సభ
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. రాష్ట్రంలో ఇవాళ నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది.
Pawan Kalyan
Nomination
Pithapuram
Janasena
Andhra Pradesh

More Telugu News