West Bengal: పశ్చిమ బెంగాల్‌ పోలింగ్ బూత్‌లో శ‌వ‌మై క‌నిపించిన సీఆర్‌పీఎఫ్ జవాన్!

CRPF jawan found dead with head injury inside polling booth in West Bengal
  • పోలింగ్‌ బూత్‌ వాష్‌రూమ్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
  • తలకు గాయాలు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల వెల్ల‌డి
  • శుక్రవారం పోస్టుమార్టం త‌ర్వాత జ‌వాన్ మృతికి గ‌ల కార‌ణం తెలిసే అవ‌కాశం
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌లోని మథభంగాలోని పోలింగ్ బూత్ వాష్‌రూమ్‌లో ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్ గురువారం రాత్రి శవమై కనిపించాడు. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే అతను చనిపోయినట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం జవాన్ తలకు కొన్ని గాయాలయ్యాయి. అత‌డు బాత్‌రూమ్‌లో జారిపడి మృతి చెందాడని ప్రాథమిక సమాచారం. అతని మృతికి గ‌ల క‌చ్చితమైన కారణాలను నిర్ధారించడానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
West Bengal
CRPF Jawan
Polling Booth
Lok Sabha Polls

More Telugu News