Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం... సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

  • అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం
  • సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి
  • ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేశారు.

శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఈడీ కేసులో అప్రూవర్‌గా మారారు. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అతను అప్రూవర్‌గా మారినట్లయింది. మద్యం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు.

కాగా,  తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ గత నెలలో అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam
K Kavitha
Arvind Kejriwal
CBI

More Telugu News