Raghu Rama Krishna Raju: ఉండి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju files nomination at Undi MRO Office
  • ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామ
  • ఇవాళ తన నివాసం నుంచి ఉండి ఎమ్మార్వో ఆఫీసు వరకు భారీ ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు
చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. 

ఈ ఉదయం 10 గంటలకు పెద అమిరం గ్రామంలోని తన నివాసం నుంచి భారీ ర్యాలీతో బయల్దేరిన రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కోలాహలం నెలకొంది. 

మెడలో టీడీపీ కండువా, తలకు గుడ్డ, కళ్లకు పోలరైజ్డ్ సన్ గ్లాసులు ధరించిన రఘురామ ర్యాలీలో ఉత్సాహంగా కనిపించారు. ఈ ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కూడా పాల్గొన్నారు. వీరిద్దరినీ అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు.
Raghu Rama Krishna Raju
Nomination
Undi
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News