Rajinikanth: రజనీకాంత్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!... టైటిల్ టీజర్ అదిరిపోయింది!

Rajinikanth 171th movie title announced
  • రజనీకాంత్ 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు
  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు టైటిల్ టీజర్ రిలీజ్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం టైటిల్ ఖరారైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే ఈ చిత్రానికి 'కూలీ' అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నేడు టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ లో రజనీకాంత్ స్టయిల్ ఫైట్ ను చూడొచ్చు. 

"మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు... తప్పేంటి ఒప్పేంటి... కొత్తగా కుమ్మేసెయ్... ఏ దారిలో వెళ్లినా సుఖాన్ని విడువకు" అంటూ రజనీకాంత్ వెరైటీ సందేశం ఇవ్వడం టీజర్ కు హైలైట్ గా నిలిచింది. 

"విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటే... స్వర్గంలో చోటుంటుంది... పోరా...! అంటూ మరో విలక్షణ డైలాగ్ కూడా రజనీ పలకడం టీజర్ లో చూడొచ్చు. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.
Rajinikanth
Coolie
171th Movie
Title
Lokesh Kanagaraj
Sun Pictures

More Telugu News