Hyderabad: నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

Software Engineer died after fall in water tank in Hyderabad
  • గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఘ‌ట‌న‌
  • హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24) మృతి
  • హాస్టల్ యాజమానిపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు
హైదరాబాద్‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. హాస్టల్‌లోని సంపు కప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అందులోపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీశారు. అనంత‌రం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు. హాస్టల్ యాజమానిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Software Engineer
Telangana

More Telugu News