Prabhas: టీఎఫ్‌డీఏకు ప్రభాస్ రూ. 35 లక్షల విరాళం.. వెల్లడించిన దర్శకుడు మారుతి

Tollywood star actor Prabhas donates Rs 35 lakh to TFDA
  • మే 4న దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతి
  • అదే రోజు ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ డే
  • ఘనంగా నిర్వహించాలంటూ ప్రభాస్ విరాళం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు హెడ్‌లైన్స్‌లోకి ఎక్కాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌(టీఎఫ్‌డీఏ)కు ఏకంగా రూ. 35 లక్షల విరాళం ప్రకటించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ముందుగానే భారీ విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. 

ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు మారుతి ప్రకటించారు. ఈ వేడుక కోసం ఇప్పటికే నటీనటులకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను ఆహ్వానించేందుకు వెళ్లగా వేడుకను ఘనంగా నిర్వహించాలంటూ రూ. 35 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రభాస్ విరాళంపై ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Prabhas
TFDA
Tollywood
Dasari Narayana Rao
Director Maruthi

More Telugu News