K Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
- కేసు పురోగతి వివరాలను కోర్టుకు తెలిపిన ఈడీ న్యాయవాది
- కవిత కస్టడీని 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం
- కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో మే 7వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతుందని... అందుకే కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. వాదనల అనంతరం కేసు పురోగతి వివరాలను ఈడీ న్యాయవాది... కోర్టుకు అందించారు. కవిత అరెస్ట్‌పై త్వరలో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు కస్టడీని పొడిగించింది.