MoongDal: పెసరపప్పుతో ఇన్ని లాభాలున్నాయా?
- పెసరపప్పులో ప్రొటీన్లు ఎక్కువ
- ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పుతో అందే కేలరీలు తక్కువ
- పెసరపప్పు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ
పప్పు కర్రీ, చారు, సాంబర్.. ఇలా చాలా వరకు మనం వాడేది కంది పప్పే.. మిగతా పప్పులనూ అప్పుడప్పుడూ వాడుతుంటాం. అందులో పెసరపప్పుతో గుండె ఆరోగ్యానికి తోడ్పడటం నుంచి వెయిట్ లాస్ దాకా.. ఎన్నో లాభాలు ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. అవేంటో చూద్దామా..
పెసరపప్పులో ప్రొటీన్లు ఎక్కువ. ముఖ్యంగా శాకాహారులు పెసరపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి.
దీనిలోని ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలక పోషకాలు, బి విటమిన్లు పూర్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్ సి, ఈ.. చర్మం నిగారించేలా చేస్తాయి.
ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పుతో అందే కేలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్.
పొట్టుతో కూడిన పెసరపప్పు, పూర్తి పెసర్లతో శరీరానికి ఫైబర్ అందుతుంది. అది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
దీనిలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పెసరపప్పు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. తిన్న వెంటనే బ్లడ్ షుగర్ పెరగడం వంటి సమస్య ఉండదు. షుగర్ బాధితులకు బెటర్.
అధిక ప్రొటీన్లు, అధిక ఫైబర్, తక్కువ కేలరీలు ఉండటం వల్ల పెసరపప్పు తిన్నప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి పప్పుల్లో ఇది బెటర్ ఆప్షన్ కూడా..