Lok Sabha Election 2024: ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వీరి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

Six Zero Assets Candidates In Lok Sabha Poll Fray
  • ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
  • రూ. 622 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా కర్ణాటక కాంగ్రెస్ నేత స్టార్ చంద్రు
  • చిల్లిగవ్వ ఆస్తి లేకున్నా బరిలోకి దిగిన ఆరుగురు అభ్యర్థులు
ఒకప్పటి సంగతి ఏమో కానీ, ఇప్పుడు మాత్రం ఎన్నికల రణరంగంలోకి దిగాలంటే మాత్రం కోట్లమూట ఉండాల్సిందే. టికెట్ దక్కించుకోవడం నుంచి ఎన్నికల ప్రచారం వరకు కోట్లు కుమ్మరించందే పని జరగదనేది బహిరంగ రహస్యం. ఎన్నికల బరిలో ఉన్న సంపన్నలను చూస్తే ఇది నిజమనిపించక మానదు. వేలకోట్లు ఉన్న ధనికులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే, నమ్మశక్యం కాని మరో విషయం కూడా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో జేబులో చిల్లిగవ్వ అభ్యర్థులు కూడా ఉన్నారంటే వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

కర్ణాటక కాంగ్రెస్ నేత, స్టార్ చంద్రుగా చిరపరిచితుడైన వెంకటరమణె గౌడ రూ. 622 కోట్లతో ఈ జాబితాలో టాప్ ‌ప్లేస్‌లో ఉన్నారు. రూపాయి ఆస్తికూడా లేని ఆరుగురు అభ్యర్థులు కూడా ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కర్ణాటకకు చెందిన ప్రకాశ్ ఆర్ఏ జైన్, రామమూర్తి ఎం. రాజారెడ్డి, మహారాష్ట్రకు చెందిన కిశోర్ భింరావ్ లబాడే, నగేశ్ శంభాజీ గైక్వాడ్, దిన్యానేశ్వర్ రావ్‌సాహెబ్ కపాటే ఉన్నారు. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం  వీరి ఆస్తి సున్నా.
Lok Sabha Election 2024
2nd Phase Voting
Richest Candidates
Zero Assets Candidates

More Telugu News