Devireddy Sivashankar Reddy: కడప లోక్ సభ స్థానం... వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి నామినేషన్ తిరస్కరణ

RO rejects Devireddy Sivashankar Reddy nomination
  • ఏపీలో నేడు నామినేషన్ల పరిశీలన
  • కడప లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన శివశంకర్ రెడ్డి
  • నామినేషన్ వేళ శివశంకర్ రెడ్డి ప్రమాణ పత్రం సమర్పించలేదన్న ఆర్వో
వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి చుక్కెదురైంది. శివశంకర్ రెడ్డి కడప లోక్ సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన చేపట్టిన ఆర్వో... దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్రమాణ పత్రం అందజేయలేదని గుర్తించారు. ప్రమాణ పత్రం లేని నామినేషన్ ఎన్నికల నియమావళికి విరుద్ధమని, శివశంకర్ రెడ్డి నామినేషన్ చెల్లదని స్పష్టం చేశారు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు.
Devireddy Sivashankar Reddy
Nomination
Lok Sabha Polls
Kadapa
YS Viveka Murder Case

More Telugu News