Perni Nani: మా మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు: పేర్ని నాని

Chandrababu copied YSRCP manifesto says Perni Nani
  • 2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసం చేశారన్న చంద్రబాబు
  • ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగన్ దని కితాబు
  • ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారన్న పేర్ని నాని
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని కొనియాడారు. 

ఇప్పుడు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే కాపీకొట్టి... సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరే ఇప్పడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. నవరత్నాలు పేరుతో తొమ్మిది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్... ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. 
Perni Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Manifesto

More Telugu News