Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో ‘బర్రెలక్క’!

Shantibai of Chhattisgarh in electoral fray from korba constituency

  • కోర్బా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శాంతిబాయి
  • శాంతిబాయికి ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి, కూలిపనులే జీవనాధారం
  • కాంగ్రెస్, బీజేపీలకు చెందిన హేమాహేమీలతో పోటీపడుతున్న వైనం

ఆమె ఓ పేదరాలు. రూ.2 వేలకు మించని బ్యాంకు బ్యాలెన్స్! అయినా ఆమె ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. అర్థబలం, అంగబలం లేకపోయినా హేమాహేమీలతో పోటీ పడుతున్న ఈమె పేరు శాంతిబాయి మారావీ. ఆమె ఉండేది చత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో! 

కోర్బా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోత్స్నా మహంత్, బీజేపీ తరపున సరోజ్ పాండే బరిలో ఉన్నారు. కోట్ల విలువైన ఆస్తులు కలిగిన వీరు తమ మందీమార్బలంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ, శాంతిబాయి మాత్రం సామాన్యురాలు. ఆమెకున్న రెండు బ్యాంకు అకౌంట్లలోని ఒకదాంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. రెండో దాంట్లో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. చేతిలో రూ. 20 వేల నగదు, 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఉంది. శాంతిబాయి చదివింది ఐదవ తరగతే. ఆమెకు పాన్‌కార్డు లేదు. సోషల్ మీడియాపై అసలు అవగాహనే లేదు. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆమెకు వ్యవసాయం, కూలిపనులే జీవనాధారం. రాజకీయంగా ఇన్ని ప్రతికూతలలు ఉన్నా శాంతిబాయి ధైర్యంగా ఎన్నికల్లో పోరాడేందుకు సిద్ధమైంది. నామినేషన్ కూడా వేసి వచ్చింది. ఆ తరువాత నుంచి ఆమె మొబైల్ స్విచ్ఛాప్ అని వస్తుండటం ఓ కొసమెరుపు.

  • Loading...

More Telugu News