Mahesh Babu: అక్కతో మహేశ్ బాబు ఫన్.. వీడియో ఇదిగో!

Mahesh Babu And His Sister Manjula Ghattamaneni Cute Video Goes Viral
  • రాజమౌళి సినిమా కోసం జుట్టు పెంచిన హీరో
  • మహేశ్ బాబు జుట్టుపై ప్రశ్నించిన మంజుల
  • ఫ్యామిలీ ఫంక్షన్ లో అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ
హీరో మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో కొత్త సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేశ్ బాబు జుట్టు పెంచేశాడు.. కసరత్తులు చేస్తూ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన మహేశ్ బాబును చూసి ఆయన సోదరి మంజుల ఆటపట్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిటీలో జరిగిన ఓ పెళ్లికి మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. అప్పటికే ఆ వేడుక వద్ద ఉన్న మంజుల తన తమ్ముడికి ఎదురువెళ్లి ఆప్యాయంగా పలకరించింది. ఆపై మహేశ్ బాబు జుట్టును చూసి.. ఇదేంటి, ఇంతలా పెంచేశావన్నట్లు జుట్టును పట్టుకుని చూసింది. రాజమౌళి సినిమా కోసం తప్పట్లేదు.. అన్నట్లు మహేశ్ బాబు బదులివ్వడంతో మంజుల నవ్వాపుకోలేకపోయింది. అక్క నవ్వులో మహేశ్ బాబు కూడా శ్రుతి కలిపాడు. అక్కాతమ్ముళ్లు కాసేపు సరదాగా మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది. ఈ క్యూట్ వీడియో చూస్తూ మహేశ్ బాబు అభిమానులు మురిసిపోతున్నారు.
Mahesh Babu
Manjula
Viral Videos
Entertainment
Rajamouli

More Telugu News