Virat Kohli: స్ట్రయిక్‌రేట్‌పై విమ‌ర్శ‌లు.. విరాట్ కోహ్లీ రిప్లై అదుర్స్‌..!

Virat Kohli bodied all those strike rate merchants

  • ఈ సీజ‌న్‌లో 10 మ్యాచులాడిన కోహ్లీ 147.49 స్ట్రయిక్‌రేట్‌తో 500 ప‌రుగులు
  • ఈ క్ర‌మంలో విరాట్ స్ట్రయిక్‌రేట్‌పై విమ‌ర్శ‌లు
  • త‌న‌కు స్ట్రయిక్‌రేట్‌, నంబ‌ర్స్ ముఖ్యం కాద‌న్న ర‌న్‌మెషిన్‌
  • జ‌ట్టు గెలుపే ముఖ్య‌మంటూ త‌న‌దైన శైలిలో ఘాటుగా బ‌దులిచ్చిన వైనం
  • ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ పేరిట‌ మ‌రో అరుదైన ఘ‌న‌త‌

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అత‌ని బ్యాట్ నుంచి ప్ర‌తి మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులాడిన కోహ్లీ 71.43 స‌గ‌టుతో 500 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక శ‌త‌కం, నాలుగు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. ఇక‌ అత‌ని స్ట్రయిక్‌రేట్‌ 147.49. అయితే, విరాట్ స్ట్రయిక్‌రేట్‌పై కొంద‌రు విమ‌ర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా కింగ్ కోహ్లీ త‌న‌దైన శైలిలో ఘాటుగా బ‌దులిచ్చాడు. 

త‌న‌కు స్ట్రయిక్‌రేట్‌, నంబ‌ర్స్ ముఖ్యం కాద‌న్నాడు. జ‌ట్టు గెలుపే ముఖ్య‌మ‌ని తెలిపాడు. ఎవ‌రికి నచ్చిన‌ట్లు వారు మాట్లాడుతార‌ని, అయితే త‌న క‌ర్త‌వ్యాన్ని తాను పూర్తి చేస్తున్న‌ట్లు చెప్పాడు. దీంతో విమ‌ర్శ‌కుల‌కు చెంప చెల్లుమ‌నిపించే రిప్లై ఇచ్చారంటూ విరాట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ పేరిట‌ మ‌రో అరుదైన ఘ‌న‌త‌
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత్య‌ధిక సార్లు 500కుపైగా ర‌న్స్ చేసిన రెండో ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ ఏడు సీజ‌న్ల‌లో 500కుపైగా ప‌రుగులు చేశాడు. నిన్న గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ రికార్డు సాధించాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ (7) రికార్డును కోహ్లీ స‌మం చేశాడు.

  • Loading...

More Telugu News