Reliance Jio: 90 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసిన జియో

Reliance Jio launches 90 days plan at Rs 749

  • రోజుకు 2 జీబీ.. అదనంగా మరో 20 జీబీ డేటా
  • రూ.749 రీఛార్జ్‌తో 90 రోజుల వ్యాలిడిటీ
  • జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్న టెలికం దిగ్గజం

దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్ బేస్ కలిగివున్న దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో సాధారణ ఆఫర్లతో పోల్చితే యూజర్లకు అధిక డేటా లభిస్తోంది. ఆఫర్‌లో రోజుకు 2జీబీతో పాటు అదనంగా మరో 20 జీబీ డేటాను జియో అందిస్తోంది. మొత్తం 200 జీబీల డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఉచిత కాలింగ్, ఎంఎస్‌ఎంలు, ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి.

ఇక ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటాను వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. 5జీ మొబైల్ కలిగివుండి కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ యాక్సెస్ ఉంటే అదనపు డేటాను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఆఫర్ కింద జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌లకు సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 90 రోజులపాటు ఈ సేవలను పొందవచ్చు.

కాగా తక్కువ రేటుతో సాధ్యమైనన్ని గరిష్ఠ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా జియో ఇటీవలే రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అనేక వర్గాలుగా విభజించింది. అందులో భాగంగా ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కాగా భారత్‌లో అత్యధికంగా 45 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లను జియో కలిగివుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్‌గా జియో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News