Amit Shah: అమిత్ షా హెలికాప్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

Amit Shah Narrow Escape As Chopper Briefly Loses Control
  • టేకాఫ్ సమయంలో కొద్దిసేపు నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్
  • కుడివైపు కొద్దిమేర వంగిన చాపర్
  • పైలెట్ నియంత్రణ సాధించడంతో సవ్యంగా ప్రయాణించిన హెలికాప్టర్
కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణించిన ఓ హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. చాపర్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో కొన్ని క్షణాలపాటు నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటనలో బీహార్‌లో సోమవారం జరిగింది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని బెగుసరాయ్‌కు వెళ్లిన అమిత్ షాకు తిరుగు ప్రయాణంలో ఈ పరిణామం ఎదురైంది.

వైరల్‌గా మారిన ఈ వీడియో ప్రకారం.. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో హెలికాప్టర్ కుడివైపునకు కొద్దిమేర వాలింది. నేలను తాకుతున్నట్టుగానే అనిపించింది. అయితే పైలెట్ తిరిగి నియంత్రణ సాధించడంతో హెలికాప్టర్ వెళ్లాల్సిన దిశలో బయలుదేరి వెళ్లింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
Amit Shah
Chopper
Helicopter
Bihar

More Telugu News