Anand Mahindra: లండ‌న్‌కి చేరిన 'డ‌బ్బావాలా' విధానం.. ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌!

Anand Mahindra Tweet on Dabbawala Food delivery Service in London
  • ముంబైలో ప్రసిద్ధి ‌చెందిన ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం
  • లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వైనం
  • అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ
  • ప‌న్నీర్ స‌బ్జీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ వంటి భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూపిస్తున్న స్టార్ట‌ప్ కంపెనీ
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో డ‌బ్బావాలాలు ఎంత ఫేమ‌స్ అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇళ్ల నుంచి భోజ‌న డ‌బ్బాల‌ను పిక‌ప్ చేసుకుని ఆఫీసుల్లో ప‌నిచేసే వారికి వాటిని డెలివ‌రీ చేయ‌డం ఈ డ‌బ్బావాలాలు చేసే ప‌ని. ఇలా ముంబైలో ఫుడ్ డెలివ‌రీ చేసే డ‌బ్బావాలా విధానం ఇప్పుడు ప‌రాయి దేశానికి కూడా చేరింది. లండ‌న్‌లోని ఓ స్టార్ట‌ప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. 

అక్క‌డి వారికి స్టీల్ డ‌బ్బాల్లో ఫుడ్ డెలివ‌రీ చేస్తోంది. ప‌న్నీర్ స‌బ్జీ, మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ వంటి భార‌తీయ వంట‌కాల‌ను రుచి చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా త‌న 'ఎక్స్' (ట్విట‌ర్‌) ఖాతా ద్వారా పంచుకున్నారు. 'రివ‌ర్స్ కాల‌నైజేష‌న్ అవుతుంద‌ని చెప్ప‌డానికి ఇంతకంటే బెట‌ర్ ఎవిడెన్స్ లేదు' అనే క్యాప్ష‌న్‌తో ఆయ‌న ఈ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.   
Anand Mahindra
Dabbawala
London
Mumbai

More Telugu News