Manta Petika: ‘మంత్ర పేటిక’ను ఆలయాలకు దగ్గరుండి పంపిణీ చేసిన అశ్వనీదత్ భార్య చలసాని వినయకుమారి
- ‘మంత్ర పేటిక’ను సమర్పించిన వినయకుమారి
- తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు, ధార్మిక సంస్థలకు వితరణ
- ‘నన్నేలు నా స్వామి’ మహాగ్రంథాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అమిత్ షా
శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన మహాగ్రంథం ‘మంత్ర పేటిక‘ను టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ భార్య చలసాని వినయకుమారి దగ్గరుండి ఆలయాలకు వితరణ చేశారు. ఆరువందల పేజీలు కలిగిన గ్రంథంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ప్రశంసలు కురిపించారు. అంతకుముందు ఆయన పురాణపండ రచన ‘నన్నేలు నా స్వామి’ మహాగ్రంథాన్ని కూడా ఆవిష్కరించారు.
కాగా, మంత్ర పేటిక గ్రంథాన్ని వినయకుమారి దగ్గరుండి మరీ తెలుగు రాష్ట్రాన్ని ఆలయాలు, ధార్మిక మండలకు వితరణ చేశారు. ఈ గ్రంథంలో ఆకట్టుకునే స్వర్ణమయ వర్ణ చిత్రాలు, కఠిన సంక్షోభాల్ని విసిరికొట్టే మంత్ర శక్తులు ఎన్నో ఉన్నాయి. పాఠకులతో ప్రశంసలు అందుకున్న ఈ గ్రంథాన్ని వినయకుమారి సమర్పణలో ప్రచురించారు. జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని చాలా ఆలయాలు ఇప్పటికే ఈ గ్రంథాన్ని అందుకున్నాయి.