Arvind Kejriwal: ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఈడీకి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
- ఈడీ అరెస్ట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
- జ్యుడీషియల్ ప్రొసీడింగ్స్ లేకుండానే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించవచ్చా అని సుప్రీం ప్రశ్న
- కేసుతో కేజ్రీకి ఉన్న సంబంధం ఏమిటో చూపెట్టాలన్న జస్టిస్ ఖన్నా
ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని ఈడీని సుప్రీంకోర్టు నేరుగా ప్రశ్నించింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... జ్యుడీషియల్ ప్రొసీడింగ్స్ లేకుండానే మీరు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించవచ్చా అని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇంత వరకు ఒక్క అటాచ్ మెంట్ చర్య కూడా తీసుకోలేదని... ఒకవేళ అటాచ్ మెంట్ జరిగి ఉంటే... కేసుతో కేజ్రీవాల్ కు ఉన్న సంబంధం ఏమిటో చూపెట్టాలని జస్టిస్ ఖన్నా అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని అడిగారు. ఈ కేసులో ఇంతవరకు కేజ్రీవాల్ కు ఉన్న సంబంధాన్ని ఈడీ వెలికితీయలేకపోవడం గమనార్హం.