AP Pensions: ఏపీలో ఈరోజు పెన్షన్లు పడనట్టే

No pensions in AP as today is May Day
  • ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వ ప్రకటన
  • ఈరోజు మేడే కావడంతో బ్యాంకులకు సెలవు
  • బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ఈరోజు పెన్షన్లు లేనట్టే
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది. 

ఈ నేపథ్యంలో మే 1న పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేనివాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. అయితే మే 1 (ఈరోజు) కార్మికుల దినం. ఈరోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో... ప్రతి ఏడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని... దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో, ఈరోజు పెన్షన్ల పంపిణీ లేనట్టే. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది.
AP Pensions
Andhra Pradesh

More Telugu News