Antarctica: ఇక్కడ వాన పడి 20 లక్షల ఏళ్లయింది... ఎందుకిలా...!
- ప్రకృతి విచిత్రాల్లో ఇదొకటి!
- 20 లక్షల ఏళ్లుగా అక్కడ చినుకు రాలని వైనం
- ఆసక్తిగొలిపే వీడియో ఇదిగో!
ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలో ఏదో ఒక మూల కుంభవృష్టితో వరదలు వస్తుంటే, మరో మూల కరవు తాండవిస్తుంటుంది. అలాగే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి వణికిస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే... ఈ భూమండలంపై ఒక ప్రాంతంలో 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట. వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ, ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఒకటుంటుందని మనం ఏమాత్రం ఊహించలేం. అదేమీ సహారా ఎడారి కాదు... అలాగని మరేదో ఎడారి కాదు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.