Stock Market: జీఎస్టీ వసూళ్ల ప్రభావంతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 128 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు పెరిగిన పవర్ గ్రిడ్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రికార్డు జీఎస్టీ వసూళ్లు, పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు సూచీలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128 పాయింట్లు లాభపడి 74,611కు చేరుకుంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.91%), ఏసియన్ పెయింట్స్ (3.36%), టాటా మోటార్స్ (1.99%), ఎన్టీపీసీ (1.72%), టాటా స్టీల్ (1.45%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.95%), యాక్సిస్ బ్యాంక్ (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-1.26%), విప్రో (-1.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.05%).