Prajwal Revanna: దర్యాప్తు సంస్థ చేతికి ప్రజ్వల్ రేవణ్ణ శృంగార వీడియోల పెన్‌డ్రైవ్

Karnataka BJP leader Devaraje Gowda submits Prajwal Revanna pendrive containing obscene clips to SIT
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ సెక్స్ స్కాండల్
  • ఆయన పెన్‌డ్రైవ్‌లో 3 వేల మంది మహిళల అశ్లీల వీడియోలు
  • సిట్‌కు పెన్‌డ్రైవ్ అందించిన బీజేపీ నేత దేవరాజె గౌడ
  • వాంగ్మూలం నమోదు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ శృంగార వీడియోల పెన్‌డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చేరింది. ప్రజ్వల్ వ్యవహారంపై గతంలో బీజేపీ అధిష్ఠానానికి లేఖ రాసిన కర్ణాటక బీజేపీ నేత దేవరాజె గౌడ ఆ పెన్‌డ్రైవ్‌ను కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అందజేశారు. 

నిన్న సిట్ ఎదుట హాజరైన దేవరాజె గౌడ వాంగ్మూలం ఇచ్చారు. ఈ పెన్‌డ్రైవ్‌ను ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తీక్ తనకు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ఇటీవల గౌడ మాట్లాడుతూ ఈ పెన్‌డ్రైవ్‌పై కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రకు గతంలోనే లేఖ రాసినట్టు చెప్పారు. ప్రజ్వల్‌కు హాసన్ టికెట్ ఇవ్వొద్దని అభ్యర్థించినట్టు పేర్కొన్నారు. తనకు అందిన ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో 3 వేలమంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిలో ప్రజ్వల్ కూడా ఉన్నాడని తెలిపారు. ఆ వీడియోలు కనుక కాంగ్రెస్‌కు దొరికితే గోల గోల అవుతుందని హెచ్చరించినట్టు పేర్కొన్నారు. అయితే, దేవరాజె‌గౌడ తనకు ఎలాంటి లేఖ రాయలేదని విజేయేంద్ర కొట్టిపడేశారు.   

సిట్ ఎదుట హాజరయ్యేందుకు తనకు వారం రోజుల సమయం కావాలని విదేశాల్లో ఉన్న ప్రజ్వల్ కోరిన తర్వాత ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. 24 గంటల్లోనే తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.
Prajwal Revanna
Sex Scandal
JDS
Karnataka
BJP

More Telugu News