Pawan Kalyan: నెల్లూరులో ఇంతటి స్వాగతం నేను ఊహించలేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he never expect such huge welcome in Nellore

  • నెల్లూరులో కూటమి రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • తాను నెల్లూరులో చదువుకున్నానని తెలిపిన జనసేనాని
  • దేశభక్తి, ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడడం ఇక్కడే నేర్చుకున్నానని వెల్లడి

నెల్లూరు నగరంలో కూటమి ఆధ్వర్యంలో నేడు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, నెల్లూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని ఊహించలేదని అన్నారు. 

తాను ఇక్కడే దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, వీఆర్సీలో చదువుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో రెండు అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో ఆ అంశాలు సహాయపడ్డాయని తెలిపారు. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటికొచ్చి గొంతు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్ పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులుపేటలో తిరిగానని వెల్లడించారు. 

ఇక్కడ కూటమి అభ్యర్థులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. గూండా ప్రభుత్వానికి మనం భయపడాలా? ఆత్మగౌరవాన్ని తీసేసే వ్యక్తులకు మనం భయపడతామా? వైఎస్ జగన్ కు మనం భయపడతామా? అంటూ కార్యకర్తల్లో కదనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. 

సింహపురి ఇది... గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురుతిరిగే సింహపురి ఇది అని అభివర్ణించారు. బలంగా నిలబడదాం... మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా... అవినీతి కోటలు బద్దలు కొడదాం అని పిలుపునిచ్చారు

  • Loading...

More Telugu News