Congress: ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ పార్టీలో కుట్ర: ఆ పార్టీ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు

Acharya Pramod Krishnam said that There is conspiracy against Priyanka Gandhi in Congress
  • త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలుతుందన్న ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్
  • కుటుంబం, పార్టీలో ప్రియాంక గాంధీపై కుట్ర జరుగుతోందన్న మాజీ కాంగ్రెస్ నేత
  • జూన్‌ 4 తర్వాత ప్రియాంక మద్దతుదారుల ఆవేదన అగ్నిపర్వతంలా విస్పోటనం చెందుతుందని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని అన్నారు. రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని అన్నారు. రాహుల్‌ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని వీడిన తీరు కాంగ్రెస్‌ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసిందని అన్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జూన్‌ 4 తర్వాత ఆమె మద్దతుదారుల గుండెల్లో ఆవేదన అగ్నిపర్వతంలా విస్పోటనం చెందుతుందని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు. 

ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని తాను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కుటుంబం, పార్టీలో జరుగుతున్న కుట్రకు బాధితురాలిగా మారారని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.

రాహుల్ గాంధీకి పాకిస్థాన్‌లో ప్రజాదరణ, డిమాండ్ పెరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయ్‌బరేలీకి బదులుగా పాక్‌లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు.
Congress
Priyanka Gandhi
Rahul Gandhi
Acharya Pramod Krishnam
Lok Sabha Polls

More Telugu News