Justin Trudeau: నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై తొలిసారి స్పందించిన కెనడా ప్రధాని

Justin Trudeau on 3 Indians Arrested in Nijjar case

  • నిజ్జర్ హత్య తరువాత కెనడాలో సిక్కులు అభద్రతకు లోనవుతున్నారన్న ప్రధాని జస్టిన్ ట్రూడో
  • స్వేచ్ఛగా జీవించడం ప్రతి కెనడా పౌరుడి హక్కు అని వ్యాఖ్య
  • తమ పౌరులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని భరోసా
  • సిక్కుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ప్రధాని వ్యాఖ్యలు

కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు. తమ పౌరులకు భద్రత కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 

‘‘కెనడాలో చట్టబద్ధపాలన కొనసాగుతోంది. స్వతంత్ర, శక్తిమంతమైన న్యాయవ్యవస్థ ఉంది. దేశ పౌరుల రక్షణకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన అన్నారు. శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కేసుకు సంబంధించి మరో కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని అన్నారు. ‘‘నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతి కెనడా పౌరుడి హక్కు’ అని వ్యాఖ్యానించారు. 

ఖలిస్థానీ వేర్పాటువేది నిజ్జర్ హత్య వెనన భారత సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారని గతేడాది ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు, తాజాగా పట్టుబడ్డ నిందితులపై కెనడా ప్రభుత్వం హత్యా నేరంపై కేసు నమోదు చేసింది. నిందితులకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News