Gold Rates Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- 24 కేరెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ. 706 తగ్గుదల
- రూ. 73,250కి తగ్గిన పది గ్రాముల పుత్తడి ధర
- కిలో వెండిపై రూ. 600 తగ్గుదల
బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన (24 కేరెట్లు) బంగారం ధర పది గ్రాములు రూ. 73,250 ఉండగా, నేడు రూ. 706 తగ్గి రూ. 72,544కు పడిపోయింది. కాగా, గతవారం రూ. 73,893గా ఉంది. అంటే వారం రోజుల్లోనే 0.87 శాతం మార్పు వచ్చింది. అదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 600 తగ్గి రూ. 82,900గా నమోదైంది.
చెన్నైలో పది గ్రాముల 24 కేరెట్ల పుత్తడి ధర రూ. 72,828గా ఉండగా, వెండి ధర రూ. 8,400గా ఉంది. ముంబైలో బంగారం, వెండి ధరలు వరుసగా రూ. 73,042, రూ. 82,900గా నమోదయ్యాయి. కోల్‌కతాలో నేడు రూ. 73,540, రూ. 82,900గా రికార్డయ్యాయి.