YS Sharmila: వివేకా హత్యపై షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila Sensational Alligations On Viveka Murder Case
  • రూ.40 కోట్లు చేతులు మారాయన్న ఏపీసీసీ ప్రెసిడెంట్
  • వైఎస్ అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణ
  • ఫోన్ కాల్స్, డబ్బులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని వెల్లడి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యలో రూ.40 కోట్లు చేతులుమారాయని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఫోన్ రికార్డులతో పాటు డబ్బులు చేతులు మారిన సాక్ష్యాలు ఉన్నా కూడా ఐదేళ్లుగా ప్రభుత్వం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు. వాస్తవానికి సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలు సేకరించేదాకా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందనే విషయం తమకు తెలియదన్నారు.

ఈ హత్యలో అవినాశ్ పాత్ర ఉందని తెలిశాక, హత్య జరగడానికి ముందు, ఆ తర్వాత ఆయన ఎవరికి ఫోన్ చేశారనే వివరాలూ బయటకొచ్చాయని షర్మిల వివరించారు. ఇంత స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వివేకా హత్య జరిగాక ఘటనా స్థలంలో ఆధారాలు తుడిచేస్తుంటే అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోవడం వెనక కారణాలేంటని షర్మిల ప్రశ్నించారు.
YS Sharmila
Viveka Murder Case
YS Avinash Reddy
APCC President
Congress

More Telugu News