Bandi Sanjay: అరెస్ట్ పేరుతో కేసీఆర్ సరికొత్త డ్రామా: బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay fires at KCR for his comments
  • అవినీతిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదన్న బండి సంజయ్
  • కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని... ఇక్కడి డబ్బుతో వారు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా
మోదీ తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అవినీతిని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని... ఇక్కడి డబ్బుతో వారు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు తాను సిద్ధమని... మీరు సిద్ధమేనా? అని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్నారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి, అక్రమాలు ఇక చాలని... కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ గెలిచే ప్రయత్నం చేస్తోందన్నారు.
Bandi Sanjay
BJP
Telangana
KCR

More Telugu News