Revanth Reddy: చంద్రబాబును 'గురువు' అంటూ ప్రశ్నిస్తే... తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి
- చంద్రబాబు గురువు, రేవంత్ శిష్యుడు అనే అభిప్రాయంతో ప్రశ్న వేసిన జర్నలిస్ట్
- శిష్యుడు ఎవరు... గురువు ఎవరు... తాను సహచరుడినని వ్యాఖ్య
- ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వెళ్లానన్న రేవంత్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు గురువు కాదు... తాను శిష్యుడిని కాదని... సహచరుడినని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్' కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ గురుశిష్యులు అంటూ ఓ ప్రశ్న సంధించారు.
'శిష్యుడి కోసం చంద్రబాబు గారు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు... ఇప్పుడు గురువుగారు అక్కడ పోటీ చేస్తున్నారు. శిష్యుడి సహకారం ఏమైనా ఉంటుందా?' అని జర్నలిస్ట్ ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... 'ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. నేను ఎఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను సహచరుడిని' అని సమాధానం చెప్పారు.