Revanth Reddy: హర్యానా, పంజాబ్ రైతుల బాటలో నడవండి: ఆర్మూర్ రైతులకు రేవంత్ రెడ్డి సూచన

Revanth Reddy suggestion to Armoor Farmers

  • ఆ రాష్ట్రాల రైతులు ప్రధాని మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారన్న సీఎం   
  • ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను కవిత గెలిచాక మరిచారని ఆగ్రహం
  • అర్వింద్ కూడా పసుపు బోర్డు అని చెప్పి మోసం చేశారని విమర్శ

పసుపు బోర్డు కోసం ఆర్మూర్ రైతులు హర్యానా, పంజాబ్ రైతుల బాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్‌లో నిర్వహించిన రోడ్డుషోలో సీఎం మాట్లాడుతూ... పంజాబ్, హర్యానా రైతులు ప్రధాని మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను కవిత గెలిచాక మరిచారని విమర్శించారు. ఆ తర్వాత అర్వింద్ కూడా పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.

2019లో రాజ్‌నాథ్ సింగ్‌ను తీసుకువచ్చి పసుపుబోర్డుపై ప్రకటన చేయించారని, ఇప్పుడు మోదీని తీసుకువచ్చి అదే మాట చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇలాగే ఇచ్చిన హామీలను జాప్యం చేస్తారా? అని నిలదీశారు. జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రూ.42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News