Matrimonial Fraud: పెళ్లి పేరుతో 25 మందిని మోసగించి.. మరో ముగ్గురిపై అత్యాచారం చేసి.. వెలుగులోకి హైదరాబాదీ అరాచకాలు

Hyderabadi duped women married 7 and raped 3

  • వయసు అయిపోయినా పెళ్లి కావట్లేదని బాధపడే మహిళలే టార్గెట్ 
  • దేశవ్యాప్తంగా నిందితుడు ఇమ్రాన్ బాధితులు
  • గతవారం ముంబైలో అరెస్ట్
  • ముంబైలో టీచర్‌ను నమ్మించి రూ. 22 లక్షలు కొట్టేసిన నిందితుడు

మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా దేశవ్యాప్తంగా 25 మందికిపైగా మహిళలను మోసగించి అరెస్ట్ అయిన 42 ఏళ్ల హైదరాబాదీ వ్యక్తి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని వివాహం చేసుకున్నాడని, పెళ్లాడతానని నమ్మించి మరో ముగ్గురిని లోబరుచుకుని లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ముంబైలోని పైదోనీ ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల టీచర్‌తో మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 22 లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితుడు ఇమ్రాన్ అలీఖాన్‌ను గతవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వయసు మీరిపోవడం వల్ల పెళ్లి కావడం లేదని బాధపడుతున్న ఆమెను నిందితుడు టార్గెట్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత అక్కడే కలిసి ఉందామని, బైకుల్లాలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నానని నమ్మించి పలు విడతలుగా ఆమె నుంచి రూ. 22 లక్షలు తీసుకున్నాడు.

విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. అతను కనీసం ఏడుగురిని మోసం చేశాడు. వీరిలో సోలాపూర్, పర్బానీ, పశ్చిమ బెంగాల్‌, ముస్సూరి, లక్నో, ఢిల్లీకి చెందిన బాధితులు కూడా ఉండడం గమనార్హం. తనను తాను వ్యాపారవేత్తలా నమ్మించేవాడు. ఆపై ఫైవ్‌స్టార్ హోటళ్లకు మహిళలను రప్పించి వారిని బుట్టలో పడేసేవాడు. వారు పూర్తిగా తన బుట్టలో పడ్డారని నమ్మాక ఇక పథకం అమలుచేసేవాడు.

  • Loading...

More Telugu News