Kannappa: 'కన్నప్ప' సెట్లోకి అడుగుపెట్టిన ప్రభాస్

Kannappa movie update
  • షూటింగు దశలో ఉన్న మంచు విష్ణు 'కన్నప్ప 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్
  • నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్న ప్రభాస్
  • ప్రధానమైన  పాత్రలలో సీనియర్ స్టార్స్

మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఏ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ న్యూజిలాండ్ లో జరిగింది. ఆ తరువాత కొంత చిత్రీకరణ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరిగింది.

తాజా షెడ్యూల్ కూడా ఈ నెల 7వ తేదీ నుంచి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. రీసెంటుగా ఆయన ఈ సినిమా సెట్లో అడుగుపెట్టాడు. మరో నాలుగు రోజుల పాటు ఆయన పోర్షన్ షూటింగ్ జరగనుంది.

 గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప' లో నందీశ్వరుడి పాత్ర ఉండదు. కేవలం శివుడికి .. కన్నప్పకి మధ్య సీన్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రను డిజైన్ చేశారు. ఇతర కీలకమైన పాత్రలలో అక్షయ్ కుమార్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. మోహన్ బాబు  తదితరులు కనిపించనున్నారు.
Kannappa
Prabhas
Manchu Vishnu
Akshay Kumar
Mohanlal

More Telugu News