Simhachalam: ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం - నిజరూప దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం!

Simhachala ksheram

  • ఈ రోజునే వైశాఖ శుద్ధతదియ 
  • సింహాచల అప్పన్న నిజరూప దర్శనం 
  • భారీగా తరలివచ్చిన భక్తజనం
  • తొలి దర్శనం చేసుకున్న అశోక గజపతిరాజు


సాధారణంగా కొన్ని క్షేత్రాలలో నృసింహస్వామి .. కొన్ని క్షేత్రాలలో వరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ రెండు అవతారమూర్తులు ఒక్కటిగా ఏర్పడిన దైవమే సింహాద్రి అప్పన్న. నృసింహస్వామి అవతారాన్ని చూసిన ప్రహ్లాదుడు, అంతకు ముందు అవతారమైన వరాహ అవతారాన్ని చూడాలని ముచ్చటగా ఉందని శ్రీమహా విష్ణువును అడుగుతాడు. అప్పుడు ఆ స్వామి వరాహనృసింహ అవతారాలను కలిపి చూపించిన పుణ్యస్థలి ఇది. 

అలాంటి ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది 'వైశాఖ శుద్ధ తదియ' రోజున చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి మూర్తిపై ఉన్న 12 మణుగుల చందనాన్ని ఒలిచి .. నిజరూపాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతినిస్తారు. అలా ఈ రోజున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిపై ఉన్న చందనాన్ని చాలా సున్నితంగా ఒలిచారు. ఆనవాయితీ ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు. 

ఆ తరువాత తెల్లవారు జాము 2: 30 గంటల నుంచి భక్తులను అనుమతినిచ్చారు. స్వామివారి నిజరూప దర్శనానికి కేవలం 12 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువలన ఆ స్వామిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోప తండాలుగా ఈ క్షేత్రానికి తరలివచ్చారు. 'అప్పన్నా' అని భక్తులు ఆప్యాయంగా పిలవడం 'సింహగిరి'పై మారుమ్రోగింది. స్వామివారి స్వయంభూ మూర్తి నుంచి ఒలిచిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ నిజరూప దర్శనం అనంతరం 3 మణుగుల చందనాన్ని అద్దుతారు. ఆ తరువాత మరో మూడు విశేషమైన రోజులలో మిగతా చందనాన్ని సమర్పిస్తారు. 

  • Loading...

More Telugu News