AP Assembly Polls: ఏపీకి కదిలిన ఓటర్లు.. కిక్కిరిసిన హైదరాబాద్‌-విజయవాడ హైవే

As Voters moving to Andhra pradesh Hyderabad and Vijayawada highway is crowded with Vehicles

  • ఏపీ అసెంబ్లీ పోలింగ్‌కి మరొక్క రోజే సమయం
  • హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన ఏపీ వాసులు
  • హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా రోజు మాత్రమే మిగిలివుంది. నేటితో (శనివారం) ప్రచారం ముగియనుండగా.. ఎల్లుండి సోమవారం ఓటింగ్ జరగనుంది. దీంతో బతుకుదెరువు, ఉద్యోగ, ఉపాధి, ఇతర కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో కదలి వెళ్తున్నారు. వారాంతం కూడా కావడంతో శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి.

సొంత వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండడంతో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఒక్కసారిగా భారీ రద్దీ పెరిగిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌జాములు అవుతున్నాయి. శనివారం వేకువజాము నుంచి ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శనివారం వేకువజాము నుంచి చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు కనిపించాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  • Loading...

More Telugu News