Agniveer Navy: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ నేవీ

Agniveer Jobs Indian Navy Notification Released
  • ఇంటర్ ఎంపీసీ అర్హతతో నేవీ ఉద్యోగం
  • ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యర్థులూ అర్హులే
  • ఈ నెల 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఇంటర్ పూర్తి చేసిన వారికి భారత నావికాదళం శుభవార్త చెప్పింది. అగ్నివీర్ పోస్టుల నియామక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసిన అవివాహిత స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 13 న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి, రెండు దశల పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు అభ్యర్థులకు ఐఎన్‌‌ఎస్‌‌ చిల్కాలో నేవీ అధికారులు శిక్షణ ఇస్తారు.

దరఖాస్తులు: మే 13 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: మే 27
విద్యార్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సజ్జెక్టులుగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ (లేదా) 
రెండేళ్ల ఒకేషనల్ కోర్సు, ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన కోర్సుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఉత్తీర్ణత 
వయస్సు: 01-11-2023 నుంచి 30-04-2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు 157 సెంమీ కంటే ఎక్కువ ఉండాలి (స్త్రీ, పురుషులు)
పరీక్ష ఫీజు: రూ.550లను ఆన్ లైన్ లో చెల్లించాలి

ఎంపిక విధానం: 
స్టేజ్-1.. కంప్యూటర్ ఆధారిత ఎంట్రెన్స్ టెస్ట్ 
స్టేజ్-2.. ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్
ఈ రెండిట్లో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ ఆధారంగా అగ్నివీర్ శిక్షణకు ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాల కోసం https://indiannavy.nic.in
Agniveer Navy
Indian Navy
Job Notifications
Central Jobs
Govt jobs

More Telugu News