Revanth Reddy: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటా: రేవంత్ రెడ్డి

Revanth reddy says will waive rs 2 lakh loan

  • తాండూరుకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్న ముఖ్యమంత్రి
  • కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్లను కేసీఆర్ రద్దు చేశారని విమర్శ
  • తెలంగాణ అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని వ్యాఖ్య

పంద్రాగస్ట్ నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... తాండూరుకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును రద్దు చేశారని విమర్శించారు.

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని అడిగితే కేంద్రం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. మే 9వ తేదీ నాటికి రైతు భరోసా కింద రూ.7500 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మాట ప్రకారం రెండ్రోజుల ముందే మే 6వ తేదీ నాటికి రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు.

  • Loading...

More Telugu News