APSRTC: ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు... బుకింగ్ కోసం ప్రత్యేక నెంబరు

APSRTC deploys special buses for who comes to AP to vote
  • ఏపీలో రేపు ఎన్నికలు
  • పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తున్న ఓటర్లు 
  • ప్రయాణికుల కోసం చర్యలు తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ
ఏపీలో సోమవారం నాడు (మే 13) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్నారు. వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది. 

స్వస్థలాలకు చేరుకునే ఓటర్ల  కోసం స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సులను ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని ఎపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 

40 మంది, అంతకుమించి ప్రయాణికులు కలిసి బస్సును బుక్ చేసుకోవచ్చని వివరించింది. అందుకోసం ప్రత్యేకంగా 99591 11281 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ పేర్కొంది.
APSRTC
Voters
Special Buses
Booking
Election Day
Andhra Pradesh

More Telugu News