Pawan Kalyan: రేపు పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే...!

Janasena chief Pawan Kalyan will cast his vote in Mangalagiri tomorrow
  • ఏపీలో రేపు ఎన్నికలు
  • మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్
  • లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన సహకార సంస్థ వద్ద పోలింగ్ బూత్ లో ఓటు
ఏపీలో రేపు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేయనున్నారు. పవన్ రేపు ఉదయమే తన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లనున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్... ఈసారి పిఠాపురంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి తన గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు.
Pawan Kalyan
Vote
Mangalagiri
Janasena
Pithapuram
Andhra Pradesh

More Telugu News