Nagababu: ఎర్ర తువ్వాలు వేసుకోవద్దనడం చట్ట విరుద్ధం... ఆ తర్వాత మీ ఇష్టం: వంగా గీతకు నాగబాబు కౌంటర్
- పిఠాపురంలో ఎర్ర కండువా ధరించి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వ్యక్తి
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీత
- ఎర్ర తువ్వాలును కాశీ తువ్వాలు అంటారన్న నాగబాబు
- అది ధరించే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుందని స్పష్టీకరణ
పిఠాపురంలో ఓ వ్యక్తి ఎర్ర కండువా ధరించి పోలింగ్ కేంద్రంలో తిరుగుతుండడం పట్ల వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అనే కోణంలో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.
ఎర్ర తువ్వాలును కాశీ తువ్వాలు అంటారని వెల్లడించారు. ఆ తువ్వాలను కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చని తెలిపారు. ఆ తువ్వాలును వేసుకునే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుంది" అని నాగబాబు స్పష్టం చేశారు. ఆ తువ్వాలును అడ్డుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అవుతుంది... ఆ తర్వాత మీ ఇష్టం" అంటూ వంగా గీతకు కౌంటర్ ఇచ్చారు.