Balakrishna: భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బాలకృష్ణ

Balakrishna along with his wife Vasundhara cast their votes
  • హిందూపురంలో ఓటు వేసిన బాలయ్య, వసుంధర
  • రెండు సార్లు వరుసగా గెలిచిన బాలయ్య
  • హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న బాలకృష్ణ
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురంలోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేశారు. హిందూపురం నుంచి బాలకృష్ణ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఓటు వేసిన అనంతరం బాలకృష్ణ దంపతులు తమ వేళ్లకు ఉన్న సిరా గుర్తులను చూపించారు. ఈరోజు ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
Balakrishna
Telugudesam
Vote
Hindupur

More Telugu News