Duvvada Srinivas: పోలింగ్ కేంద్రంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఓటేసిన టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. వీడియో ఇదిగో!

YCP candidate Duvvada Srinivas cast his vote while talking in mobile
  • పోలింగ్ కేంద్రంలోకి వెళ్లింది మొదలు బయటకు వచ్చే వరకు ఫోన్‌లోనే దువ్వాడ
  • అభ్యంతరం చెప్పని పోలింగ్ సిబ్బంది
  • అప్పటికే క్యూలో ఉన్న ఓటర్ల ఆగ్రహం
  • దువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరని తెలిసి కూడా స్వయంగా ఓ అభ్యర్థే దానిని ఉల్లంఘించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిన్న పోలింగ్ బూత్‌లోకి ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా ఫోన్ మాట్లాడుతూనే రెండు ఓట్లు వేశారు. పోలింగ్ సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు అభ్యంతరం చెప్పలేదు సరికదా.. దువ్వాడ అనుచరులు పదుల సంఖ్యలో పోలింగ్ కేంద్రంలోకి వచ్చి వీడియోలు తీశారు.

ఇంత జరుగుతున్నా అందరూ చోద్యం చూశారు తప్ప ఎవరూ అడ్డుకోలేదని, అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు సామాన్యులకేనా అని ప్రశ్నించారు. ఈసీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Duvvada Srinivas
YSRCP
Tekkali
Srikakulam District

More Telugu News