Chandrababu: ఇది ఒక చారిత్రాత్మక సందర్భం.. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్ర‌బాబు

Chandrababu on PM Modi nomination in Varanasi

  • ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వార‌ణాసి వెళ్లిన చంద్ర‌బాబు
  • ఎన్డీయే 400 సీట్లకు పైగా సాధించ‌డం ఖాయమ‌ని జోస్యం
  • ఇదే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్ప‌టికే వార‌ణాసి చేరుకున్న‌ పవన్ కల్యాణ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ‌ వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీయే భాగ‌స్వామ్య‌ పార్టీల అధినేతలకు ఇప్ప‌టికే ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. 

"ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇది ఒక పవిత్ర ప్రదేశం. నరేంద్ర‌ మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. గత 10 ఏళ్లలో ఆయన చాలా బాగా పనిచేశారు. దేశానికి ఆయన అవసరం. రాబోయే రోజుల్లో ప్ర‌పంచ వేదిక‌పై భారతదేశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఎన్డీయే 400 సీట్లకు పైగా సాధించ‌డం ఖాయం" అని చంద్ర‌బాబు అన్నారు. 

అలాగే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్‌ మోదీ మృతిపై ఆయ‌న స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. బీజేపీ సీనియ‌ర్ నేత అకాల మ‌ర‌ణం బాధాకరమైన సంఘటన అని టీడీపీ అధినేత పేర్కొన్నారు. కాగా, మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News